ASF: బెజ్జూర్ గ్రామపంచాయతీ నుంచి నాగులవాయిను నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరుతూ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లకు గ్రామస్థులు వినతి పత్రం ఇచ్చారు. వారు మాట్లాడుతూ.. బెజ్జారు గ్రామపంచాయతీలో ఉండటంతో అభివృద్ధి జరగడంలేదన్నారు. మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదన్నారు. నాగులవాయిని గ్రామపంచాయతీ ఏర్పాటు చేస్తే అభివృద్ధి జరిగే అవకాశం ఉందని తెలిపారు.