గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. తాజాగా ఈ సినిమా నుంచి బాలకృష్ణ పోస్టర్ రిలీజ్ కాగా.. నెట్టింట ట్రెండీగా మారింది. ‘ఇది రా పోస్టర్ అంటే’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇందులో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నారు. అయితే, ఈ మూవీ భారీ అంచనాల మధ్య సంక్రాంతికి జనవరి 12న రిలీజ్ కానుంది.