TG: మూడు తరాలుగా తమ కుటుంబం ఏంటో తెలుసని ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అన్నారు. దయచేసి అర్థం చేసుకోండి.. న్యాయపరమైన సమస్యలు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే మీ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అల్లు అర్జున్ వెళ్లిపోయారని తెలిపారు. తాను చేసిన పాన్ ఇండియా మూవీని థియేటర్లో చూసుకుందామనే వెళ్లాడని, థియేటర్ వద్ద జరిగిన ఘటన తర్వాత తమ ఇంట్లో పార్కులో ఓ మూలన కూర్చొని అదే ఆలోచనలో ఉన్నాడని పేర్కొన్నారు.