రాజస్థాన్లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఆర్థికమంత్రులు, అధికారులతో GST కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. పాప్కార్న్పై 5 శాతం GST విధించారు. ప్యాకేజింగ్ పాప్కార్న్పై 12 శాతం, స్వీట్ పాప్కార్న్పై 18 శాతం విధించారు. అలాగే సంస్థలు కొనుగోలు చేసే పాతకార్లపై 12 నుంచి 18 శాతానికి GSTని పెంచారు. ఆరోగ్య, జీవిత బీమాపై, పన్నుశ్లాబు తగ్గింపుపై కౌన్సిల్ నిర్ణయం వాయిదా పడింది.