కాకినాడ: రూరల్ మండలం వాకలపూడి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనంలో పెంకు పురుగులు, రాళ్ళు వస్తున్నాయని స్కూల్ విద్యార్ధినులు అంటున్నారు. బెండపూడికి చెందిన అల్లూరి సీతారామరాజు ట్రస్టు ద్వారా స్కూల్‌కి భోజనాలు సరఫరా అవుతున్నాయి. ఈ భోజనం తింటుంటే కడుపు నొప్పి వస్తుందని విద్యార్థినులు. భోజనం బాగుండక పోవడంతో తినకుండా డస్ట్ బిన్లో వేశారు.