అన్నమయ్య: నిమ్మనపల్లి మండలం, బండమీదపల్లి సమీపంలోని బహుదా నది వద్ద శుక్రవారం కొంతమంది కోడిపందెం ఆడారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.2,200, రెండు పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. హెడ్ కానిస్టేబుల్ డి. రమేశ్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.