E.G: బిక్కవోలు మండలం రంగాపురం గ్రామానికి చెందిన నక్క వెంకటరావు, లక్ష్మి దంపతుల పూరిపాక అగ్నికి పూర్తిగా ఆహుతైంది. ప్రమాదంతో బాధితుల సర్వం కొల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హాని జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు.