MHBD: కొత్తగూడ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండల కేంద్రం సమీపంలోని గాదే వాగు అటవీ ప్రాంతంలో ప్రధాన రహదారిపై ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులపై కోతులు దాడి చేశాయి. ఈ క్రమంలో బైకు అదుపుతప్పి కింద పడగా మహిళ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.