KMM: రంపచోడవరంలో కొత్తగా మంజూరైన అంగన్వాడీల్లో ఆయాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఈనెల 20 నుంచి 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా సంబంధిత శిశు అభివృద్ధి పథకం అధికారిణికి లేదా పోస్ట్ ద్వారా సమర్పించాలని చెప్పారు.