ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీపై స్పెషల్ డాక్యుమెంటరీని రూపొందించగా.. ‘RRR బి హైండ్ అండ్ బియాండ్’ అని పేరు పెట్టారు. సుమారు గంటన్నర నిడివి ఉన్న ఈ సిరీస్ రేపు థియేటర్లలో రిలీజ్ కానుంది. ఎంపిక చేసిన స్క్రీన్లలో స్పెషల్ షోలు వేస్తున్నారు. బుక్ మై షోలో టికెట్లను అందుబాటులో ఉంచారు. టికెట్ ధర రూ.200 నుంచి రూ.300 వరకు ఉందట.