ప్రధాని మోదీ ఈ నెల 21 నుంచి రెండు రోజుల పాటు కువైట్లో పర్యటించనున్నారు. అక్కడి నేతలు, ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. వ్యాపార, దౌత్య సంబంధాలపై చర్చలు జరపనున్నారు. అలాగే అక్కడి భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కువైట్లో భారత ప్రధాని పర్యటించడం 43ఏళ్లలో ఇదే తొలిసారి. అంతకంటే ముందు 1981లో అప్పటి ప్రధాని ఇందిరా పర్యటించారు.