Telangana govt : రంజాన్ వేళ… ముస్లిం ఉద్యోగులకు శుభవార్త..!
Telangana Govt : రంజాన్ మాసం మొదలవ్వబోతోంది. ఈ క్రమంలో ముస్లింలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మార్చి 23నుంచి ఏప్రిల్ 23 వరకు ముస్లిం ఉద్యోగులు, విద్యార్థులు గంట ముందుగానే తమ కార్యాలయాలు, కాలేజీలనుంచి బయటకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.
రంజాన్ మాసం మొదలవ్వబోతోంది. ఈ క్రమంలో ముస్లింలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మార్చి 23నుంచి ఏప్రిల్ 23 వరకు ముస్లిం ఉద్యోగులు, విద్యార్థులు గంట ముందుగానే తమ కార్యాలయాలు, కాలేజీలనుంచి బయటకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు తాజాగా విడుదలయ్యాయి. రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు చేసేవారికి ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
రంజాన్ మాసంలో లో ప్రతి రోజూ ఉపవాస దీక్ష చేపడతారు ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. సాయంత్రం ప్రార్ధనల్లో పాల్గొనడానికి అనుకూలంగా ముస్లిం ఉద్యోగులు గంట ముందుగానే బయటకు వెళ్లేందుకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. టీఎస్-ఎంఎస్ సెంట్రల్ అసోసియేషన్ హైదరాబాద్ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కి ముస్లింలు ధన్యవాదాలు తెలిపారు.