తన సినిమా జనాల్లోకి వెళ్లడం కోసం ఏదైనా చేసే రకం విశ్వక్ సేన్(vishwak sen). అందుకే మాస్ కా దాస్ కొత్త సినిమా వస్తుందంటే.. ప్రమోషన్ హడావిడి మామూలుగా ఉండదు. కానీ ఈ సారి మాత్రం అలా చేయలేదు విశ్వక్. ఫలక్‌నుమా దాస్ సినిమాతో మాస్ హిట్ అందుకున్న విశ్వక్ సేన్.. అప్పటి నుంచి వెనుతిరిగి చూడలేదు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ‘ఓరి దేవుడా'(ori devuda) అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొస్తున్నాడు.
అయితే లాస్ట్ ఫిల్మ్ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ప్రమోషన్స్‌లో రచ్చ రచ్చ చేశాడు విశ్వక్. ఫ్రాంక్ వీడియో.. డిబేట్‌తో ఫుల్ పబ్లిసిటీ చేశాడు. అయితే ఓరి దేవుడా సినిమా ప్రమోషన్స్ మాత్రం ప్రశాంతంగా జరిగాయి. ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు విశ్వక్. తన ప్రతి సినిమా విడుదలకి ముందు ఏదో ఒక లొల్లి జరిగిందని.. కానీ ఈ సారి అలాంటి గొడవలేం లేకుండా.. ఈ సినిమా ప్రశాంతంగా రిలీజ్ అవుతుందని చెప్పుకొచ్చాడు. ఇక దీనికితోడు విశ్వక్ కోసం సీనియర్ హీరో వెంకటేష్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో పాటు.. యంగ్ హీరోలంతా కదిలొచ్చారు.
రాజమండ్రిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రామ్ చరణ్ గెస్ట్‌గా అటెండ్ అయి.. సినిమా పై హైప్ క్రియేట్ చేశాడు. ఇక దీవాళి దావత్ ఈవెంట్లో.. ఆకాష్ పూరి, ఆది సాయికుమార్, విశ్వక్సేన్, సందీప్‌కిషన్, కార్తికేయ, సిద్ధు జొన్నలగడ్డ, అల్లరి నరేష్ అథితులుగా హాజరయ్యారు. ఇక ఎలాగు వెంకటేష్ ఈ సినిమాలో నటించాడు కాబట్టి.. అంచనాలు గట్టిగానే ఉన్నాయి. మరి ఇంతమంది సపోర్ట్‌తో వస్తున్న ‘ఓరి దేవుడా’ విశ్వక్‌కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.