NLR: జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపటి నుంచి మొదలయ్యి రెండు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. దీంతో పంట కోతలు విషయంలో రైతుల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.