SKLM: వంగర మండల కేంద్రంలో సోమవారం ఎంఎస్ఎంఈ సర్వేను సచివాలయ సిబ్బంది చేపట్టారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి నారాయణరావు మాట్లాడుతూ.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ఈ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దుకాణ యజమానుల వివరాలను ఎంఎస్ఎంఈ యాప్లో నమోదు చేయించాలన్నారు.