TG: ఇప్పటి వరకు మూడు దశల్లో మొత్తం రూ.45,249 కోట్లకు సీఆర్డీఏ ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ తెలిపారు. ఇందులో అసెంబ్లీ భవనానికి రూ.765 కోట్లు, హైకోర్టుకు రూ.1,048 కోట్లు, 5 ఐకానిక్ టవర్లకు రూ.4,665 కోట్లు, 4 జోన్లలో రోడ్ల టెండర్లకు రూ.9,699 కోట్లు, ట్రంక్ రోడ్లకు రూ.7,794 కోట్లకు అనుమతులిచ్చినట్లు వెల్లడించారు. అయితే వచ్చే మంత్రివర్గంలో రోడ్లకు ఆమోదం తెలుపుతామని పేర్కొన్నారు.