కామారెడ్డి జిల్లాకు చెందిన వడ్ల సాయి కృష్ణ తెలంగాణ రాష్ట్ర బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సాయి కృష్ణ మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో కార్యదర్శిగా ఎన్నుకున్న రాష్ట్ర బీఎల్ పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు.