ELR: జిల్లా 28 మండలాల్లో మొత్తం 665 రెవెన్యూ గ్రామాలుండగా ఇంతవరకు 132 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగిందని జిల్లా జాయింట్ దాత్రి రెడ్డి తెలిపారు. సోమవారం జరిగిన 31 రెవెన్యూ సదస్సుల్లో 824 మంది పాల్గొని ఆయా సమస్యలపై 326 అర్జీలను అందజేశారని, వాటిలో 15 దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించామన్నారు. జనవరి 8 వరకు ఈ సదస్సులు జరుగుతాయన్నారు.