సిరియాను వీడి రష్యాకు వెళ్లడంపై ఆ దేశ మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ తొలిసారి స్పందించారు. దేశాన్ని వీడిపోవాలనే ఆలోచన తనది కాదని వెల్లడించారు. తిరుగుబాటుదారులపై రష్యా బేస్ నుంచే పోరాటం చేయాలనుకున్నానని.. కానీ, సైనిక స్థావరంపై డ్రోన్ దాడులు జరగడంతో రష్యానే తనను తరలించిందని పేర్కొన్నారు. డమాస్కస్‌ను తిరుగుబాటు దళాలు ఆక్రమించుకున్న నేపథ్యంలో అసద్ రష్యాకు వెళ్లిపోయారు.