VSP: విశాఖ వీఎంఆర్డీఏ ప్రజాదర్బార్‌కు 15 అర్జీలు వచ్చినట్టు సంస్థ ఛైర్మన్ ప్రణవ్‌గోపాల్, కమీషనర్ విశ్వనాథన్ సోమవారం తెలిపారు. అర్జీదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అలానే రహదారి విస్తరణకి సంబందించి బాధితులతో స్వయంగా మాట్లాడి వారికి దైర్యం చెప్పారు. అనంతరం అధికారులతో వారి సమస్యలను చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.