»Cpi Narayana Serious On Ys Jagan Over Assembly Issue
CPI Narayana డిమాండ్..! జగన్ క్షమాపణలు చెప్పాలి..
CPI Narayana : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన సంఘటనపై సీపీఐ నారాయణ మండిపడ్డారు. అసెంబ్లీ అరాచకానికి నిలయంగా మారిందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేలను పట్టుకుని కొట్టడం ఏంటని ప్రశ్నించారు. వారు మనుషులా? పశువులా? అని నిలదీశారు. బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్ నేత పట్ల ఇలా వ్యవహరించడం తగదని నారాయణ అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన సంఘటనపై సీపీఐ నారాయణ మండిపడ్డారు. అసెంబ్లీ అరాచకానికి నిలయంగా మారిందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేలను పట్టుకుని కొట్టడం ఏంటని ప్రశ్నించారు. వారు మనుషులా? పశువులా? అని నిలదీశారు. బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్ నేత పట్ల ఇలా వ్యవహరించడం తగదని నారాయణ అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి నిరాశ నిస్పృహల్లో ఉందని నారాయణ్ అన్నారు.
నిరక్షరకుక్షులకు ఓటు హక్కు కల్పించి మరి దొంగ ఓట్లు వేయించుకున్నారని నారాయణ మండిపడ్డారు. అయినా సరే ఓడిపోవడంతో వైసీపీ నేతలు నిరాశలో కూరుకుపోయారని… అందుకే అసెంబ్లీలో ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని నారాయణ తెలిపారు. గతంలో అసెంబ్లీలో తోపులాట జరిగిందే తప్ప, ఇలాంటి దాడులు చోటు చేసుకోలేదని గుర్తుచేశారు. టీడీపీ ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పలేక, కొడతారా? అంటూ నారాయణ ఫైర్ అయ్యారు.
స్పీకర్, సీఎం ఇద్దరిదీ తప్పు ఉంది. స్పీకర్, సీఎం జగన్ ఇద్దరూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నారాయణ డిమాండ్ చేశారు. అధికారం, సీఎం పదవి శాశ్వతం కాదని నారాయణ అన్నారు. దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యేలను శాశ్వతంగా సస్పెండ్ చేయాలని కోరారు. దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవడం మాని, బాధితులను సస్పెండ్ చేయడం తగదని అన్నారు. ఇలాంటి ఘటన ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని నారాయణ అన్నారు.