TG: రాష్ట్రంలో పట్టు పరిశ్రమను ప్రోత్సహించాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. శాసనమండలి సమావేశాల్లో మాట్లాడిన కవిత.. ‘రైతులను మల్బరీ సాగువైపు ప్రోత్సహించాలి. జగిత్యాల కేంద్రంగా సిల్క్ వార్మ్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి. సెరికల్చర్ విభాగంలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. బెంగళూరు నుంచి పట్టు దిగుమతితో చేనేతలకు అదనపు భారం పడుతుంది. పట్టు గూళ్ల బకాయిలు రూ.8కోట్లు విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు.