మేడ్చల్: ఈనెల 18న మేడ్చల్ ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో ఉదయం 11 నుంచి 2 గంటల వరకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రాధికా తెలిపారు. ఈ మేళాలో పలు కంపెనీలు ఉద్యోగార్థులను ఎంపిక చేసుకుంటాయని చెప్పారు. పది, డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ జాబ్ మేళాకు అటెండ్ కావచ్చు. రూ.15 నుంచి రూ.25 వేల వరకు జీతం ఉంటుందన్నారు.