VZM: ప్రతి ఒక్కరూ ఇంధనాన్ని పొదుపు చేయాలని సబ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి.త్రినాథరావు కోరారు. నెల్లిమర్ల పట్టణంలోని మొయిద జంక్షన్ వద్ద సోమవారం జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బుర్రకథ ద్వారా ఇంధనం పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించారు. త్రినాథరావు మాట్లాడుతూ.. వినియోగదారులు విద్యుత్‌ను వృథా చేయకూడదని చెప్పారు.