VZM: లక్కవరపుకోట మండల కేంద్రంలో జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ని-క్షయ్ శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. ప్రజలందరూ టీబీ వ్యాధి పట్ల శ్రద్ధ వహించాలని, అలాగే టీబీ రహిత భారత్కు సహకరించాలని ఆమె ప్రజలను కోరారు.