WGL: రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై అనుచిత వాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్య తీసుకోవాలని మహిళ కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ డిమాండ్ చేశారు. చెన్నారావుపేట పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆమె ఎస్సై రాజేష్‌కి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ అగ్రనాయకులపై గురిజాలకి చెందిన పొదిల కుమారస్వామి వాట్సాప్ గ్రూపులో అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు.