VSP: ప్రజా సమస్యల వేదికగా మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం వినతులు స్వీకరించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ ఆదేశాలు మేరకు మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జనవాణి కార్యక్రమంలో విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు, జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు.