ప్రతిపక్షాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్ట్రాంగ్ కౌంటర్లు వేశారు. పెత్తందారులకు, పేదాలకు మధ్య జరుగుతున్న పోరాటమిదని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు, జగన్(jagan) పై జగన్ పరోక్షంగా కామెంట్ల వర్షం కురిపించారు. ఏం చేయలేని వాళ్లు చెప్పు చూపించి బూతులు తిడుతున్నారని.. ఇలాంటి వాళ్లు మన నాయకులా అంటూ మండిపడ్డారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్టీఆర్ జిల్లా అవనిగడ్డలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జగన్… పవన్ కళ్యాణ్(pawan kalyan) ఇటీవల చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మూడు రాజధానులు కాదు.. మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుందని చెబుతున్నారని.. మహిళల జీవితాలు ఏం కావాలి.. సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు.
వెన్నుపోటుదారులంతా ఎవరికీ మంచి చేయలేదని.. ఎన్నికల తర్వాత వాళ్లు వాగ్దానాలు మరిచిపోతారని విమర్శించారు. వీళ్లు బూతులు తిట్టడంలో వీధి రౌడీలను మించిపోయారని.. ఇటువంటి దుష్టచతుష్టయం కూటమిగా ఏర్పడి.. ఈ ప్రభుత్వం మీద యుద్ధం చేస్తారట.. కుతంత్రాలను, కుళ్లును, దత్తపుత్రుడిని వాళ్లు నమ్ముకుంటే.. కానీ, తాను మాత్రం ప్రజల్ని నమ్ముకున్నాను అన్నారు.
ఇలాంటి యుద్ధంలో కుట్రలు, కుతంత్రాలు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా కనిపిస్తాయన్నారు. దత్తపుత్రుడితో దత్త తండ్రి ఏం మాట్లాడిస్తున్నారో చూస్తున్నామన్నారు. ఇలాంటి వారు ప్రజలకు దశ దిశ చూపగలరా అంటూ ప్రశ్నించారు. వీళ్లంత కూటమి కట్టి తనపై ప్రభుత్వంపై యుద్ధం చేస్తారట అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.