తన పెళ్లి గురించి నటి తాప్సి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. అందరూ అనుకుంటున్నట్లు తన పెళ్లి ఈ ఏడాది జరగలేదన్నారు. తమ పెళ్లి గతేడాది డిసెంబర్లోనే ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాము. త్వరలోనే మా పెళ్లి రోజు రాబోతుంది. ఇవాళ నేను ఈ విషయాన్ని బయటపెట్టకపోతే ఎవరికీ దీని గురించి తెలిసేది కాదు’ అని పేర్కొన్నారు.