VZM: గజపతినగరం మండలంలోని గుడివాడ నీలగిరి తోటలో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన నడిమింటి గాంధీకి చెందిన తోటలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 15 వేల రూపాయలు ఆస్తి నష్టం సంభవించింది. అజాగ్రత్తగా పొగ త్రాగడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. గజపతినగరం ఆగమాపకం అధికారి రవి ప్రసాద్ సిబ్బందితో వెళ్లి మంటల్లో అదుపు చేశారు.