నిన్న మొన్నటి వరకు ‘గాడ్ ఫాదర్’ జపం చేసిన మెగా ఫ్యాన్స్.. ఇప్పుడు వాల్తేరు వీరయ్య కోసం వెయిటింగ్ అంటున్నారు. పైగా మెగా 154(mega 154) చిత్ర యూనిట్.. పూనకాలు లోడింగ్ అంటూ అంచనాలను మరింతగా పెంచెస్తున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. మరోసారి తనదైన మాస్ మేనియాతో దుమ్ముదులిపేందుకు రెడీ అవుతున్నారు చిరంజీవి.
సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇటీవలె డబ్బింగ్ పనులు మొదలు పెట్టిన ఈ సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా టీజర్ అండ్ టైటిల్‌ను దీపావళి సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపధ్యంలో టీజర్ పై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమాలో మాస్ మహారాజా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వైజాగ్ రంగరాజు అనే పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నాడని టాలీవుడ్ టాక్. దాంతో ఈ టీజర్ కట్ ఓ రేంజ్లో ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారని సమాచారం. మొత్తంగా అంతకు మించి అనేలా.. మెగా 154 టీజర్ మెగాభిమానులకు మాస్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుందంటున్నారు. ఇక శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. మరి మెగా 154 టీజర్ ఎలా ఉంటుందో తెలియాలంటే మరో రెండు, మూడు రోజులు వెయిట్ చేయాల్సిందే.