Nobel Prize : ప్రధాని మోదీకి నోబెల్ బహుమతి… అవన్నీ పుకార్లే…!
Nobel Prize : నోబెల్ ప్రైజ్‌కు ప్రధాని మోడీ ప్రధాన పోటీ దారుడిగా ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. ఒక్కసారిగా ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వార్తపై నోబెల్ కమిటీ డిప్యూటి లీడర్ అస్లే టోజే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఇదంతా ఫేక్ న్యూస్ అని క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన ట్వీట్ చేశారు.
నోబెల్ ప్రైజ్‌కు ప్రధాని మోడీ ప్రధాన పోటీ దారుడిగా ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. ఒక్కసారిగా ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వార్తపై నోబెల్ కమిటీ డిప్యూటి లీడర్ అస్లే టోజే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఇదంతా ఫేక్ న్యూస్ అని క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన ట్వీట్ చేశారు.
ఈ వార్తల్లో నిజం లేదని, దీనిని ఫేక్ న్యూస్‌గానే గుర్తించాలని పేర్కొన్నారు. ఈ విషయం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని, దీనిపై పదేపదే మాట్లాడటం వలన ఈ న్యూస్ ఇలానే సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూనే ఉంటుందని అన్నారు. ట్వీట్ చేసిన అంశాలను కేటగిరివారిగా ఖండిస్తున్నట్లు అస్లే టోజే పేర్కొన్నారు.
ఇటీవలే భారత్ కు వచ్చిన నోబెల్ కమిటీ డిప్యూటి లీడర్ అస్లే టోజే జాతీయ మీడియా ఏజెన్సీతో మాట్లాడారు. భారత ప్రధాని పనితీరును మెచ్చుకున్నారు. అణ్వస్త్రాలను వినియోగిస్తే ఏలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో రష్యాకు వివరించారని, ఈ విషయంలో భారత్ చొరవ తీసుకోవడంతోనే రష్యా అణ్వాయుధాల వినియోగంపై వెనక్కి తగ్గిందని అన్నారు. భారత్ ఏ విషయంలోనూ స్వరం పెంచి మాట్లాడదని, స్నేహపూర్వకంగా మాట్లాడుతూ అవసరమైన సూచనలు చేస్తుందని అన్నారు.