అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ తీవ్ర ఆరోపణలు చేశారు. సిరియాలో జరుగుతున్న పరిణామాల వెనుక ఈ రెండు దేశాల ప్లాన్లు ఉన్నాయని, ఆ దేశ అధ్యక్షుడు అసద్ పతనం కావడంలో వీటి భాగం కూడా ఉన్నట్లు వెల్లడించారు. సిరియా పొరుగునున్న ఓ దేశం కూడా వీటితో జత కలిసిందని వ్యాఖ్యానించారు. కాగా, ఇప్పటికే సిరియా నేవీని ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. గత 48 గంటల్లో ఆ దేశంపై 480 దాడులు జరిపింది.