వణుకు పుట్టించే చలికి ఒళ్లంతా స్తబ్దుగా అనిపిస్తుంది. అయితే శరీరానికి శక్తినిచ్చే కొన్ని ఆహార పదార్ధాలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నువ్వులు, బెల్లం శరీరంలో వేడిని పుట్టించి ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. దుంపలు, పాలకూర, ఉసిరి, నారింజ వంటి వాటిలో ఉండే పోషకాలు రోగనిరోధకతను పెంచుతాయి. చర్మం, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇన్ల్ఫమేషన్ని తగ్గించి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి.