MDK: మహిళా కళాశాలను సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట కలెక్టర్ కె.హైమావతి అన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల సిద్దిపేటలో డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కొరకు రూపొందించిన దరఖాస్తుల ఆహ్వాన గోడపత్రికను కలెక్టర్ ఛాంబర్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.