కృష్ణా: గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ నాగదుర్గ ప్రసాద్ మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ కళాశాల రోడ్డులో ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న వారి కుమార్తె కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చారన్నారు. కిడ్నాప్ కేసుగా రిజిస్ట్రేషన్ చేసి, తల్లిదండ్రులు అనుమానిస్తున్న వ్యక్తి కాల్ డేటాను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. త్వరలో నిందితుడిని అదుపులోకి తీసుకుంటాం అన్నారు.