ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రాల్లో ఆదిపురుష్(adipurush) కూడా ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా.. రామాయణం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. సంక్రాంతి కానుగా జనవరి 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలె అయోధ్యలో గ్రాండ్‌గా టీజర్ రిలీజ్ చేశారు. ఇక ఆదిపురుష్ టీజర్ కోసం ఎంతగా ఎదురుచూశారో.. టీజర్ రిలీజ్ అయ్యాక అంతకుమించి ట్రోలింగ్ చేశారు నెటిజన్స్.
అయినా కూడా టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. పైగా త్రీడి టీజర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు అసలు ఆదిపురుష్ ఊసే లేకుండా పోయింది. అటు దర్శక, నిర్మాతలు కూడా ఆదిపురుష్ గురించి అప్టేట్స్ ఇవ్వడం లేదు. కానీ ప్రభాస్ బర్త్ డే కానుకగా మరో టీజర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆదిపురుష్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం పై ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్‌గా భారీ హైప్ ఉన్న సంగతి తెలిసిందే.
ఇదే విషయం మరోసారి ప్రూవ్ అయింది. వరల్డ్ వైడ్‌గా గత 30 రోజుల్లో అత్యధికంగా సెర్చ్ చేసిన అంశాల్లో ఆదిపురుష్ +1850 శాతం రేటింగ్‌తో నెంబర్ 1 ప్లేస్‌లో నిలిచింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పకొచ్చారు మేకర్స్. ఈ లెక్కన ప్రపంచ వ్యాప్తంగా ఆదిపురుష్ క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఆదిపురుష్ ఈ క్రేజ్‌ను కాపాడుకోవాలంటే.. మరో టీజర్‌తో సత్తా చాటాల్సి ఉంది. ఏదేమైనా.. టీజర్ డిసప్పాయింట్ చేసిన కూడా.. ఆదిపురుష్ పై భారీ అంచాలన్నాయి.