అల్లు అర్జున్ ‘పుష్ప-2’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. రెండు రోజుల్లో ఈ మూవీ రూ.449 కోట్లు కలెక్షన్లు రాబట్టినట్లు చిత్ర బృందం తెలిపింది. దీంతో దేశంలోనే రెండో రోజుకే రూ.400 కోట్ల మార్క్ దాటేసిన తొలి చిత్రంగా ఘనత సాధించింది. కాగా, తొలిరోజు రూ.294 కోట్లు సాధించిన పుష్ప-2.. రెండో రోజు కాస్త తగ్గింది.