»Effect Of H3n2 Cases Schools Closed In Puducherry From March 16 To 26
H3N2 Cases Effect: మార్చి 16 నుంచి 26 వరకు స్కూల్స్ బంద్
H3N2 వైరస్ వ్యాప్తి(H3N2 virus cases) నేపథ్యంలో పుదుచ్చేరి(Puducherry)లోని అన్ని పాఠశాలలు రేపటి నుంచి బంద్ పాటించనున్నాయి. మార్చి 16 నుంచి మార్చి 26 (ఆదివారం) వరకు మూసివేయబడతాయని అక్కడి విద్యాశాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పుదుచ్చేరిలో H3N2 కేసులు 80కిపైగా నమోదయ్యాయి.
పుదుచ్చేరి(Puducherry)లో H3N2 వైరస్ కేసుల(H3N2 Cases) పెరుగుదల నేపథ్యంలో అక్కడి విద్యా శాఖ మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని పాఠశాలలు మార్చి 16 నుంచి మార్చి 26 (ఆదివారం) వరకు మూసివేయనున్నట్లు వెల్లడించారు. మార్చి 11 నాటికి పుదుచ్చేరిలో H3N2 వైరల్ కేసులు(H3N2 viral cases) 79కిపైగా నమోదయ్యాయి. అయితే H3N2కి సంబంధించిన మరణాలు మాత్రం ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఇప్పటి వరకు నమోదు కాలేదని అక్కడి అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో ప్రజలు భయాందోళన చెందవద్దని అధికారులు తెలిపారు. పెరుగుతున్న కేసులను నియంత్రించడానికి యూటీలోని ఆరోగ్య శాఖ అధికారులు ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(primary health centre) అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆసుపత్రుల్లో ఔట్ పేషెంట్ విభాగాల్లో (OPD) ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దీంతోపాటు ఇన్ఫ్లుఎంజా వైరస్ లక్షణాలు ఉన్న వారు చికిత్స చేయించుకోవాలని కోరారు.
గత వారం రోజుల నుంచి H3N2 వైరస్ వ్యాప్తి కొన్ని రాష్ట్రాల్లో క్రమంగా పెరగడంపై కేంద్ర ప్రభుత్వం(central government) ఆందోళన వ్యక్తం చేసింది. ఇన్ఫ్లుఎంజా అనారోగ్యం (ILI) లేదా తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ (SARI) కేసులపై మార్గదర్శకాలను పాటించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తెలిపింది. మందులు, వైద్య ఆక్సిజన్ లభ్యత, కోవిడ్ -19, ఇన్ఫ్లుఎంజాకు వ్యతిరేకంగా టీకాలు సహా అన్నింటిని సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. జనవరి 1 నుంచి వివిధ వైరల్ రీసెర్చ్, డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు (VRDLలు) చేపట్టిన శ్వాసకోశ నమూనాల పరీక్ష ప్రకారం, దాదాపు 25.4% నమూనాలు అడెనోవైరస్‌లకు పాజిటివ్‌గా పరీక్షించబడ్డాయి.
ఈ వైరస్ (virus) సోకి చనిపోయిన వారి సంఖ్య ఇప్పటికే మూడుకు చేరింది. గుజరాత్‌కు (gujarat) చెందిన 58 ఏళ్ల మహిళ హెచ్3ఎన్2 వైరస్ లక్షణాలతో చనిపోయిందని వైద్యులు (doctors) నిర్ధారించారు. హెచ్3ఎన్2 వైరస్ (H3N2 Virus) వైరస్‌ను హాంకాంగ్ వైరస్ అని పిలుస్తున్నారు. ప్లూ లక్షణాలతో బాధపడుతున్న మహిళను వడోదర (vadodara) ఆస్పత్రికి తరలించగా.. ఆమె చికిత్స పొందుతూ చనిపోయారు.
హెచ్3ఎన్2 వైరస్ (H3N2 Virus) లక్షణాలు కూడా కరోనాను (corona) పోలిన విధంగా ఉన్నాయి. శ్వాస సంబంధ సమస్యతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతున్నాయని ఐసీఎంఆర్ (icmr) పేర్కొంది. జనవరి 2వ తేదీ నుంచి భారతదేశంలో హెచ్3ఎన్2 వైరస్ (H3N2 Virus) కేసులను నమోదు చేశారు. ఈ నెల 5వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 451 కేసులను గుర్తించారు. వారిలో ముగ్గురు చనిపోయారు. తెలంగాణ (telangana) రాష్ట్రంలో కేసులు పెరగడంతో వైద్య నిర్ధారణ పరీక్షలు చేయాలని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తోంది.