అన్నమయ్య: రాజంపేట పట్టణ శివారుల్లోని భువనగిరిపల్లె అర్చి వద్ద బుధవారం తెల్లవారుజామున లారీ – ట్రావెల్స్ బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.