కోనసీమ: ఆలమూరు మండలం చొప్పెల్లకు చెందిన విశ్వనాధుల వీరభద్రరావు ఇంట్లో నవంబర్ 26న జరిగిన చోరీ కేసులో కడియం మండలం రాజవోలు గ్రామానికి చెందిన తమ్మ వినోద్ కుమార్, ఏలూరు పవన్ కుమార్లను అరెస్ట్ చేసినట్లు రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ తెలిపారు. నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.3 లక్షల నగదు, 48 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీన పరుచుకున్నారు.