»Janasena 10th Formation Day In Machilipatnam Andhra Pradesh March 14th 2023
Janasena 10th Formation Day: రేపే మచిలీపట్నంలో ఆవిర్భావ సభ..ప్లాన్ కూడా రెడీ!
రేపు మచిలీపట్నం(Machilipatnam)లో జనసేన(Janasena party) 10వ ఆవిర్భావ సభ(10th Formation Day) జరగనుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్(pawan kalyan) నాలుగు రోజుల ముందే విజయ వాడకు చేరుకుని వివిధ కులాలతో సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు. ఇక ఏపీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్సీపీని(YSRCP) గద్దె దించడమే లక్ష్యంగా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ నేత మనోహర్(Nadendla Manohar) తెలిపారు. ఈ వేదికపై మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ భవిష్యత్తు ప్రణాళిక గురించి వివరిస్తారని మనోహర్ చెప్పారు.
రేపు (మార్చి 14న) మంగళవారం మచిలీపట్నం(Machilipatnam)లో జనసేన పార్టీ(Janasena party) 10వ ఆవిర్భావ సభ(10th Formation Day) జరగనుంది. ఈ సమావేశంలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్(YSRCP) పార్టీని ఎదుర్కోవడానికి పవన్(pawan kalyan) తన ప్రణాళికను ప్రకటించే ఛాన్స్ ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పవన్ తమ పార్టీ శ్రేణులను కోరారు. అయితే, జెఎస్పీ(JSP) కాషాయ పార్టీకి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ, బీజెపీ(BJP) అభ్యర్థులకు మద్దతు ఇవ్వమని ఆయన వారిని అడగలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికలలో పొత్తుకు సంబంధించి అంశంపై కూడా పవన్ కళ్యాణ్ ఓ క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాషాయ పార్టీతో ఎన్నికల పొత్తు లేదా ప్రత్యామ్నాయంగా తెలుగుదేశంతో(TDP) కొత్త పొత్తు పెట్టుకోవడంపై పవన్ మంగళవారం క్లియర్ చేస్తారని పార్టీతోపాటు ఇతర వర్గాలు భావిస్తున్నాయి.
పవన్ తన కస్టమ్ మేడ్ ఎన్నికల ప్రచార వాహనం ‘వారాహి’లో బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. జాతీయ రహదారి 65కి కిలోమీటరు దూరంలో ఉన్న 34 ఎకరాల భూమిని కొంతమంది రైతులు పవన్‌కు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అందించారు. అప్పటి మద్రాసు ప్రావిన్స్‌లో భాగమైన తెలుగు(telugu) మాట్లాడే ప్రాంతాలకు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ 56 రోజుల నిరాహార దీక్ష చేసి మరణించిన పొట్టి శ్రీరాములు పేరును ఈ వేదికకు పెట్టారు. వైఎస్సార్సీపీని అధికారం నుంచి గద్దె దించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్(AP) భవిష్యత్తు దృష్ట్యా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జెఎస్పీ(JSP) నాయకులు చెబుతున్నారు.
కాగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం(sunday) కాపు నేతలతో పవన్ సమావేశమయ్యారు. జనసేన మరే ఇతర పార్టీ కోసం పనిచేయదని లేదా ఇతర పార్టీల ఎజెండాను ప్రచారం చేయడానికి ప్రయత్నించదని ఆయన అన్నారు. తమ పార్టీ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయనివ్వబోమన్నారు. కాపులు పెద్ద పాత్ర పోషించి దళితులు, బీసీలతో(BCs) కలిసి నడుచుకుంటేనే రాష్ట్రంలో అధికారం సాధించవచ్చని పేర్కొన్నారు. లేకుంటే రాజకీయ సాధికారత తమకు ఎప్పటికీ సాధ్యం కాదన్నారు.
కులాల్లో కాపు, తెలగ, బలిజ, ఒంటరి వర్గాలకు చాలా ప్రాధాన్యత ఉందని, అయితే వారికి సంఖ్యా బలం ఉన్నా రాజ్యాధికారం దక్కడం లేదని పవన్(pawan kalyan) అన్నారు. ఇప్పుడు కూడా రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఈ వర్గాలు అడుక్కోవడం బాధాకరమని చెప్పారు. కాపుల సాధికారత కోసం త్యాగాలకు సైతం నాయకులు సిద్ధం కావాలని కోరారు. మరీ ముఖ్యంగా కాపుల మధ్య ఐక్యత ఏర్పడనంత వరకు రాజకీయ సాధికారత సాధ్యం కాదన్నారు. కాపుల ఆర్థిక వెనుకబాటుతనాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తిగా చెబుతున్నానని గుర్తు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలు(2024 elections) చాలా కీలకమని పవన్ అన్నారు. అందుకే సీనియర్ నాయకులు చేగొండి హరిరామ జోగయ్య తదితరుల సూచనలను స్వీకరించి జేఎస్పీ(JSP) తన ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేస్తుందని వెల్లడించారు.