Viral News : ఎయిర్ ఇండియా విమానం లో స్మోకింగ్…. వ్యక్తిపై కేసు నమోదు..!
Viral News : ఎయిర్ ఇండియా విమానంలో స్మోక్ చేసినందుకు ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. లండన్ నుండి ముంబయి వెళ్తున్న ఎయిరిండియా విమానంలో ఓ వ్యక్తి దూమపానం చేయడంతో ఆయనమీద కేసు నమోదు చేశారు. ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి.. వాష్‌రూమ్‌లోకి వెళ్లి సిగరెట్ వెలిగించగానే అక్కడ ఉన్న స్మోక్ అలారమ్ మోగింది.
ఎయిర్ ఇండియా విమానంలో స్మోక్ చేసినందుకు ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. లండన్ నుండి ముంబయి వెళ్తున్న ఎయిరిండియా విమానంలో ఓ వ్యక్తి దూమపానం చేయడంతో ఆయనమీద కేసు నమోదు చేశారు. ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి.. వాష్‌రూమ్‌లోకి వెళ్లి సిగరెట్ వెలిగించగానే అక్కడ ఉన్న స్మోక్ అలారమ్ మోగింది. అప్రమత్తమైన సిబ్బంది వాష్‌రూమ్ కు వేలి చూడగా ఓ వ్యక్తి సిగరెట్ తాగుతూ కనిపించాడు. విమానంలో రమాకాంత్ అనే వ్యక్తి బాత్రూమ్కు వెళ్లగానే అలారం మోగడం ప్రారంభించిందని, దీంతో అందరం బాత్రూమ్ వైపు పరిగెత్తినప్పుడు అతను సిగరెట్ తాగుతున్నాడని విమాన సిబ్బంది తెలిపారు.
సిగరెట్ ను పారవేసి అతన్ని సీటులోకి వెళ్ళవలసిందిగా కోరాము. అయితే కొంతసేపటి తర్వాత విమానం తలుపులు తెరవడానికి ప్రయత్నించాడు అని ఎయిర్ ఇండియా సిబ్బంది పోలీసులకు తెలిపారు. అతని ప్రవర్తనతో ఒక్కసారిగా ప్రయాణికులు భయబ్రాంతులకు గురైయ్యారు.
ఎంతచెప్పినా వినకపోవడంతో అతని చేతులు, కాళ్లు కట్టి సీటుపై కూర్చోబెట్టామని ఎయిర్ ఇండియా సిబ్బంది సహర్ పోలీసులకు తెలిపారు. అతనిపై సెక్షన్ 336 ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం 1937, 22 కింద కేసు నమోదు చేసారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడా లేక మానసిక రుగ్మతలతో బాధపడుతున్నాడా అనే విషయాన్ని నిర్ధారించేందుకు వైద్య పరీక్షల కోసం నిందితుడి నమూనాను పంపామని పోలీసులు తెలిపారు.