»Natu Natu Song Gets Oscar Award In Best Original Song Category
Oscars95 ట్రెండింగ్ లో.. #NaatuNaatu #RRRMovie
ట్విటర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, స్నాప్ చాట్, షేర్ చాట్ ఇలా అన్ని సామాజిక మాధ్యమాల్లో నాటునాటు పాట ట్రెండింగ్ లో కొనసాగుతున్నది. #NaatuNaatu , #RRRMovie #Teulugu ప్రపంచవ్యాప్తంగా ఉర్రూతలూగిస్తున్న నాటునాటు పాట ప్రతిష్టాత్మక అవార్డు (Award) సొంతం చేసుకోవడంతో ఇక భారతీయుల ఆస్కార్ దాహాన్ని తీర్చేసింది.
అమెరికాలో జరుగుతున్న 95వ ఆస్కార్ అవార్డ్స్ (95 Oscar Awards) 2023 వేడుకల్లో మన తెలుగోడి సినిమా.. భారతీయ సినిమా మెరిసింది. ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా మూడు చిత్రాలు నామినేషన్స్ (Nominations) దశకు చేరుకున్న విషయం తెలిసిందే. వాటిలో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ (Best Original Song) కేటగిరిలో RRR పాట “నాటు నాటు” (NatuNatu Song), ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ (షౌనక్ సేన్ ఆల్ దట్ బ్రీత్స్), ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ (కార్తికి గోన్సాల్వేస్ దర్శకత్వం వహించిన ది ఎలిఫెంట్ విస్పరర్స్) నిలిచాయి. ఇప్పటికే ది ఎలిఫెంట్ విస్పరర్స్ అవార్డు సొంతం చేసుకుని సత్తా చాటగా.. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా నాటు నాటు పాట కూడా ఆస్కార్ ను కొల్లగొట్టి భారతీయ సినీ ప్రపంచాన్ని ప్రపంచ వేదికపై నిలిపింది.
నిద్రలేచినప్పటి నుంచి ఆస్కార్ వార్తలే ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇక అవార్డు ప్రకటించిన వెంటనే ఆస్కార్ అవార్డుల ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. చప్పట్లు మార్మోగాయి. అంతకుముందు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ నాటు నాటు పాటను ప్రత్యక్షంగా పాడారు. వారి పాటకు వెనుకాల డ్యాన్సర్లు డ్యాన్స్ చేశారు. ఈ పాటకు ఆడిటోరియం కాలు కదిపింది పాట అనంతరం సభికులందరూ నిల్చొని చప్పట్లు, ఈలలతో సందడి చేశారు.
కాగా ఒరిజినల్ సాంగ్ కు మొత్తం ప్రపంచవ్యాప్తంగా 81 పాటలు ఎంట్రీకి వచ్చాయి. తుది జాబితాలో ఐదు పాటలు నామినేట్ అయ్యాయి. వాటిలో మన నాటు నాటు పాటతో పాటు టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్ (అప్లాజ్), హోల్డ్ మై హ్యాండ్ (టాప్ గన్: మావెరిక్), లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్), దిస్ ఈజ్ లైఫ్ (ఎవ్రిథింగ్ ఎవ్రివేర్ ఆల్ ఎట్ వన్స్) పాటలు అవార్డు కోసం పోటీ పడ్డాయి. కానీ మన పాటనే అవార్డును సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. గతంలో మన దేశానికి చెందిన రహమాన్ కు అవార్డు దక్కాయి. కానీ భారతీయ సినిమాకు అవార్డు దక్కడం మాత్రం ఆర్ఆర్ఆర్ ద్వారానే సుసాధ్యమైంది.
అవార్డు దక్కడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో నాటు నాటు పాట ట్రెండింగ్ లోకి వచ్చింది. ట్విటర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, స్నాప్ చాట్, షేర్ చాట్ ఇలా అన్ని సామాజిక మాధ్యమాల్లో నాటునాటు పాట ట్రెండింగ్ లో కొనసాగుతున్నది. #NaatuNaatu , #RRRMovie #Telugu ప్రపంచవ్యాప్తంగా ఉర్రూతలూగిస్తున్న నాటునాటు పాట ప్రతిష్టాత్మక అవార్డు (Award) సొంతం చేసుకోవడంతో ఇక భారతీయుల ఆస్కార్ దాహాన్ని తీర్చేసింది. ఈ చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli)కి అందరూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. కాగా ఈ పాటకు సాహిత్యం చంద్రబోస్ అందించగా.. సంగీతం ఎంఎం కీరవాణి మాస్ లెవల్లో సంగీతం అందించారు. తెలంగాణ పోరడు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ అద్భుతంగా పాడగా.. ఈ పాటకు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ఊర మాస్ స్టెప్పులు ఇచ్చాడు. సినిమాలో ఈ పాట సూపర్ హైలెట్ గా నిలిచింది.