NZB: రెండు విద్యుత్తు ఫీడర్లపై విద్యుత్ పనులు జరగనున్న నేపథ్యంలో రెండు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని కామారెడ్డి ట్రాన్స్కో ఎడీఈ నరేష్ కుమార్ తెలిపారు. మంగళవారం ఉదయం 10:00 గంటల నుంచి 12:00 గంటల వరకు 33/11 కేవీ సదాశివనగర్ మండలం మర్కల్, పోసానిపేట్ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని చెప్పారు. వినియోగదారులు గమనించాలన్నారు.