MIM chief asaduddin owaisi slams pm modi on kavitha ED enquiry
Asaduddin owaisi:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (kavitha) ఈడీ విచారిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. సీఎం కేసీఆర్ (kcr) కుటుంబాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (modi) టార్గెట్ చేశారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కవిత (kavitha) ఈడీ విచారణ ముమ్మాటికీ కక్షసాధింపేనని అసదుద్దీన్ అంటున్నారు. ప్రతిపక్షాలను వేధించడం కేంద్ర ప్రభుత్వం పని అయిపోయిందన్నారు. విచారణ పేరుతో హరాస్ చేయడం సరికాదన్నారు. ఈ క్రమంలో కవితకు మద్దతుగా నిలుస్తామని.. ఆయన స్పష్టంచేశారు.
దేశంలోని ముస్లింలను ఆర్థింకగా వెలివేయాలని బీజేపీ ఎంపీలు పిలుపునిచ్చారు. ప్రజలు తమ ఇళ్లలో ఆయుధాలు పెట్టుకోవాలని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తోన్న కేసీఆర్ కుటుంబాన్ని (kcr) టార్గెట్ చేయడంలో బిజీగా ఉంది. ఇదీ ఎంత మాత్రం తగదన్నారు. బీఆర్ఎస్ మిత్రపక్షంగా ఎంఐఎం ఉంది. కవిత (kavitha) విచారణపై తొలి పార్టీ స్పందించింది. మిగతా విపక్షాల మద్దతును కూడా కేసీఆర్ కోరారు. అందరం కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత (Kavitha) మెడకు చుట్టు బిగుస్తోంది. ఇప్పటికే ఆమె మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును (gorantla buchibabu) అరెస్ట్ చేశారు. ఆయన ఇటీవలే తీహార్ జైలు నుంచి ఇటీవలే షరతులతో కూడిన బెయిల్ మీద బయటకు వచ్చారు. మరో అనుచరుడు రామచంద్రా పిళ్లైను (ramachandra) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతను కవిత ప్రతినిధిని అని ఈడీ అధికారులకు (ed officials) చెప్పారట. తర్వాత మాట మార్చిన సంగతి తెలిసిందే. దీంతో లిక్కర్ స్కామ్లో కవిత (Kavitha) అరెస్ట్ తప్పదని తెలుస్తోంది.
BJP MPs have called for economic boycott of Muslims; they’ve asked people to keep weapons at home. But Modi govt is busy targeting @TelanganaCMO & his family for his leadership in Telangana’s inclusive development