NZB: డిచ్పల్లి మండలంలోని సుద్ధపల్లి గ్రామంలోని టీజీ డబ్ల్యూఆర్ఎస్ కళాశాలకు చెందిన విద్యార్థిని సంకీర్తన రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ నళిని తెలిపారు. ఈ హ్యాండ్ బాల్ పోటీలు త్వరలో ఆర్మూర్ మీని స్టేడియంలో జరగనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థినిని ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ స్వప్న, కోచ్ మౌనిక, తదితరులు అభినందించారు.