»Ramachandra Pillai Retracted His Statement In The Liquor Case
Ramachandra Pillai: ఢిల్లీ లిక్కర్ కేసులో వాంగ్మూలం వెనక్కి!
ఈడీ(ED)కి ఇచ్చిన వాంగ్మూలాలను ఉపసంహరించుకుంటూ హైదరాబాద్(hyderabad) వ్యాపారవేత్త అరుణ్ పిళ్లై(Ramachandra Pillai) ఢిల్లీ(delhi) కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో కోర్టు ఈడీ ఏజెన్సీకు నోటీసులు జారీ చేసింది. అయితే అరుణ్ పిళ్లై కవిత బినామీగా ఉన్నట్లు గతంలో ఈడీ(ED)కి తెలిపాడు. ఇప్పుడు అదే వాంగ్మూలం వెనక్కి తీసుకోవడం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం(delhi liquor case) కేసులో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈడీ(Enforcement Directorate) అరెస్టు చేసిన హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై(Ramachandra Pillai )శుక్రవారం ఢిల్లీలోని అవెన్యూ కోర్టులో కేంద్ర ఏజెన్సీకి ఇచ్చిన వాంగ్మూలాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిళ్లై ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో తాను కవిత(kavitha) బినామీనని వెల్లడించాడు. కానీ తాజాగా ఆ వాంగ్మూలం వెనక్కి తీసుకుంటానని కోర్టును కోరడం చర్చనీయాంశంగా మారింది. పిళ్లై పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో సీబీఐ(cbi) స్పెషల్ కోర్టు ఈడీ(ED)కి నోటీసులు జారీ చేసింది.
ఇప్పటికే ఈడీ అధికారులు.. ఎమ్మెల్సీ కవితను హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయగా..తాను మార్చి 11న హాజరవుతానని ఆమె తెలిపింది. ఈ పరిణామాల క్రమంలో అసలు కవిత ఈడీ(ED) ఎదుట హాజరు అవుతుందా లేదా? అరెస్టు అవుతుందా లేదా? అనే దాని కోసం పలువురు రాజకీయ నాయకులతోపాటు ప్రజల్లో కూడా ఆసక్తి మొదలైంది. ఈ కేసులో గంటల తరబడి పిళ్లైని విచారించిన తర్వాత సోమవారం అర్థరాత్రి ఏజెన్సీ అరెస్టు చేసిన తర్వాత కోర్టు మంగళవారం పిళ్లైని మార్చి 13 వరకు ED కస్టడీకి పంపించింది.
ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా(manish sisodia)ను మధ్యాహ్నం కోర్టు ముందు హాజరుపరచనున్నారు. మరోవైపు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారిస్తున్న ఈ కేసులో మనీష్ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. దేశ రాజధానిలో 30 శాతానికి పైగా మద్యం వ్యాపారాన్ని నియంత్రించే తయారీదారులు, హోల్‌సేలర్లు, రిటైలర్లతో కూడిన కార్టెల్ (ఇప్పుడు సౌత్ గ్రూప్ అని పిలుస్తారు) ఏర్పాటులో పిళ్లై ప్రమేయం ఉందని ED ఆరోపించింది.
BRS నాయకురాలు కె.కవిత, అరబిందో ఫార్మా ప్రమోటర్ శరత్ రెడ్డి, ఒంగోలు YSRCP MP మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అతని కుమారుడు రాఘవ్ మాగుంట సహా పలువురు ఉన్న ఈ కేసులో ఈన్నట్లు ED తెలిపింది. సౌత్ గ్రూప్‌కు అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయిన్పల్లి, బుచ్చిబాబు ప్రాతినిధ్యం వహించారని ఏజెన్సీ పేర్కొంది. పిళ్లై ఇండో స్పిరిట్స్(indospirits) లో 32.5 శాతం వాటాతో భాగస్వామిగా ఉన్నారు. అతను కె. కవితకు ప్రాతినిధ్యం వహించినట్లు ED గతంలో తెలిపింది. ఈ మొత్తంలో కవిత ఆదేశాల మేరకు కోటి రూపాయలు పిళ్లైకి ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది.