నెట్ బ్యాంకింగ్, ఈ -కామర్స్, ఆధార్ OTP మెసేజ్లు డిసెంబర్ 1 నుంచి ఆలస్యం కానున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ట్రాయ్ ఖండించింది. మెసేజ్ల డెలివరీలో ఎలాంటి జాప్యం ఉండబోదని వెల్లడించింది. OTPలు ఎప్పటిలాగే సత్వరమే అందుతాయని పేర్కొంది. ఫేక్ కాల్స్, ఫ్రాడ్ మెసేజ్లను అరికట్టేందుకు ట్రేస్ బిలిటీ వ్యవస్థను తీసుకొచ్చామని, దీని ప్రభావం OTP డెలివరీలపై ఉండబోదని తేల్చిచెప్పింది. ఈ మేరకు ట్రాయ్ ఎక్స్(X)లో పోస్ట్ చేసింది.