»Bjp Plan To Uproot Aap From Delhi Country With These
BJP targets AAP: 400 రోజుల్లో 10 కేజ్రీవాల్ కుంభకోణాలతో ముందుకు…
దేశానికి సరికొత్త రాజకీయాలను (politics) పరిచయం చేస్తామని, అవినీతి లేని రాజకీయమే (Clean Politics) తమ లక్ష్యమని చెప్పి, అధికారంలోకి వచ్చాక మాత్రం నిండా అవినీతిలో మునిగిపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) టార్గెట్ గా భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) పకడ్బంధీగా ముందుకు సాగేందుకు సద్ధమవుతోంది.
దేశానికి సరికొత్త రాజకీయాలను (politics) పరిచయం చేస్తామని, అవినీతి లేని రాజకీయమే (Clean Politics) తమ లక్ష్యమని చెప్పి, అధికారంలోకి వచ్చాక మాత్రం నిండా అవినీతిలో మునిగిపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) టార్గెట్ గా భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) పకడ్బంధీగా ముందుకు సాగేందుకు సద్ధమవుతోంది. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో (delhi liquor scam case) ఆ పార్టీ కీలక నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia) జైలులో ఉన్నారు. ఈ కేసుతో ప్రజలకు ఆ పార్టీపై ఉన్న అభిప్రాయం మారిపోయింది. అన్ని పార్టీలు అంతే అనే (corruption politics) పరిస్థితికి వచ్చింది. ఈ నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారీ సీట్లు దక్కించుకోవాలనుకుంటున్న బీజేపీ.. 400 రోజులు, ఆమ్ ఆద్మీ 10 కుంభకోణాలతో ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi Chief Minister) అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ను కార్నర్ చేసే ప్లాన్ చేస్తోంది. కేజ్రీ ప్రభుత్వం లోని పది కీలక, పెద్ద స్కాంలను బయటపెట్టి, ఢిల్లీలోనే కాకుండా, దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ శాఖల నుండి నిర్దిష్ట సమాచారాన్ని సేకరించిందని తెలుస్తోంది.
లోకసభ ఎన్నికలకు (Lok Sabha elections 2024) మరో ఏడాదికి పైగా సమయం ఉందని, ఈ నేపథ్యంలో రానున్న 400 రోజుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆయన కేబినెట్ చేసిన అవినీతిని ప్రజల ముందు పెడతామని, 2025లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections) వరకు ఈ ప్రచారం నిర్వహిస్తామని బీజేపీ నాయకులు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి (Aam Aadmi Party) సంబంధించి పది పెద్ద, కీలక కుంభకోణాలు (AAP scams) ఉన్నాయని, వాటి సూత్రదారి కేజ్రీవాల్ (Arvind Kejriwal) అని, వాటిని బహిరంగ పరుస్తామని చెబుతున్నారు. వారి అవినీతి, అక్రమాలను ప్రజల ముందుకు తీసుకు వెళ్లడమే ఇప్పుడు తమ ముందు ఉన్న లక్ష్యం అని చెప్పారు. ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే.
జైలు నుండి సిసోడియా లేఖ (Sisodia letter from jail)
మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన మనీష్ సిసోడియా (Manish Sisodia) తీహార్ జైలు (Tihar Jail) నుండి లేఖ రాశారు. దేశంలో విద్యను ఎందుకు పక్కన పెట్టారని, రాజకీయ నాయకులు తమ శక్తిని, వనరులను చిన్నారుల విద్య పైన పెట్టి ఉంటే ఎంతో బాగుండేదని అందులో పేర్కొన్నారు. దేశంలోని పిల్లలందరికీ న్యాయమైన విద్యా సంస్థలను నెలకొల్పి, మంచి విద్యను అందించడం కంటే విపక్షాలను జైలులో పెట్టడం ద్వారా భిన్నాభిప్రాయాలను అణిచి వేయడం సులభమని భావిస్తున్నట్లుగా కనిపిస్తోందని అందులో పేర్కొన్నారు. తద్వారా ఆయన జైలు రాజకీయాలను విద్యా రాజకీయాలతో ముడి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. విద్యా రాజకీయాలు (నాణ్యమైన విద్య) దేశాన్ని ముందుకు తీసుకు వెళ్తాయని, ప్రతి బిడ్డకు మంచి విద్యను అందిస్తే బాధ్యతాయుతమైన పౌరుడిగా మారుతారన్నారు.